AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పాను- ఎమ్మెల్సీ డొక్కా

ఎమ్మెల్సీ గా ఏకగ్రీవ ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డొక్కా టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరే ముందే అయన తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన స్థానానికి వైసీపీ మళ్లీ ఆయన్నే నిలబెట్టింది. టీడీపీ పదవులను వదిలేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి […]

అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పాను- ఎమ్మెల్సీ డొక్కా
Sanjay Kasula
|

Updated on: Jul 14, 2020 | 1:12 PM

Share

ఎమ్మెల్సీ గా ఏకగ్రీవ ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డొక్కా టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరే ముందే అయన తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన స్థానానికి వైసీపీ మళ్లీ ఆయన్నే నిలబెట్టింది. టీడీపీ పదవులను వదిలేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా మాణిక్య వరప్రసాద్ అని అంబటి రాంబాబు అన్నారు. రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పిన మాటకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. మా పార్టీ నైతిక విలువలకు ఇది నిదర్శనం అని వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు డొక్కా మాణిక్యవరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. చట్టసభలు అత్యధిక ప్రమాణాలతో ఉండాలని భావిస్తానని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తను సభకు ఆబ్సెంట్ అవ్వలేదని అన్నారు. అలాంటిది మండలిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాలు గౌరవించాలి… శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడడం బాధకలిగించిందని వెల్లడించారు. నేను రాజీనామా చేయడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. మండలి అంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలన్నారు.