AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీ తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారత్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ..

శ్రీరాముడసలు భారతీయుడే కాదు.. నేపాల్ పీఎం కొత్త కాంట్రవర్సీ
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 1:53 PM

Share

భారత్ పట్ల వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పంచాయతీని తెరమీదకు తెచ్చింది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా భారతీయ హిందువుల విశ్వాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. దేశంలోని ఎంతో మంది భక్తులు తమ ఆరాధ్య దైవంగా, ఆదర్శప్రాయంగా కొలుచుకునే శ్రీరాముడు ఓ నేపాలీ అని, భారతీయుడు కాదంటూ ఓలీ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని ఓలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రాముని జన్మస్థలం విషయంలో భారత్ వాస్తవాలు వక్రీకరిస్తుందంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యానించారు. నిజమైన అయోధ్య భారత్‌లో లేదన్నారు. నేపాల్ దేశంలోని పశ్చిమ బిర్గుంజ్‌కు సమీపంలోని థోరి గ్రామంలో ఉందని తెలిపారు. దశరథుని కుమారుడైన రాముడు భారతీయుడు కాదని అన్నారు. అయోధ్య థోరీలో ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తమ దేశంలో రాముడి జన్మస్థలం ఉందని పేర్కొంటోందని ఓలీ వ్యాఖ్యానించారు. వాల్మికీ ఆశ్రమం కూడా నేపాల్‌లో ఉందన్నారు. పుత్రుల కోసం దశరథుడు యాగం నిర్వహించిన చోటు రిధి, ఇది కూడా నేపాల్‌లోనే ఉందని ఓలీ వాదించారు. అసలు అయోధ్య భారత్‌లో కాదు నేపాల్‌లో ఉందని ఆయన వాదించారు. ఈమేరకు నేపాల్ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.

గత కొద్ది కాలంగా భారత్ – నేపాల్ మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ఇటీవల మన దేశ సరిహద్దులోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్‌పైనా నేపాల్ ప్రభుత్వం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో భారత్‌లోని ప్రైవేట్ టీవీ ఛానల్స్ నేపాల్‌లో తమ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుపై అధికార నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ మండిపడుతోంది. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ.. పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు

Follow Us
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..