AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Polycet 2026: మరో వారంలోనే తెలంగాణ పాలిసెట్‌ 2026 ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026--27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్‌ 2026 మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో అధికారులు హాల్‌ టికెట్లను విడుదల చేశారు. పాటీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు..

TG Polycet 2026: మరో వారంలోనే తెలంగాణ పాలిసెట్‌ 2026 ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
Telangana Polycet Hall Tickets
Srilakshmi C
|

Updated on: May 07, 2026 | 2:19 PM

Share

హైదరాబాద్‌, మే 7: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్‌ 2026 మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో అధికారులు హాల్‌ టికెట్లను విడుదల చేశారు. పాటీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ టెన్త్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, క్యాప్చా లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌/ మొబైల్‌ నంబర్‌ క్యాప్చా ఎంటర్‌ చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక పాలిసెట్‌ 2026 పరీక్ష మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. ఫలితాలు పరీక్ష జరిగిన 12 రోజులలోపు ప్రకటించనున్నారు.

తెలంగాణ పాలీసెట్‌ 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ పాలిసెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ పాలీసెట్ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు

మరోవైపు ఏపీలో ఇప్పటికే పాలీసెట్‌ పరీక్ష నిర్వహించడంతోపాటు ఫలితాలు కూడా వెల్లడించారు. ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షలో 91.37 శాతం మంది అర్హత సాధించినట్లు అధకారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో మొత్తం 1,77,581 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1,63,008 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,48,950 మంది అర్హత సాధించారు. బాలికలు అత్యధికంగా 93.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 89.88 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 16 మంది 120కి 120 మార్కులు సాధించారు. గత తొమ్మిదేళ్లలో కంటే ఈసారే ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ పాలీసెట్‌ 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us