AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఎన్టీఆర్ ఆ హీరోకు మాత్రమే ఆ క్వాలిటీ ఉంది.. ఆ ఇద్దరినే నేను చూశా.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్..

డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆయన ఇప్పుడు సినిమాలు తగ్గించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పకొచ్చారు.

Krishna Vamsi: ఎన్టీఆర్ ఆ హీరోకు మాత్రమే ఆ క్వాలిటీ ఉంది.. ఆ ఇద్దరినే నేను చూశా.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్..
Ntr, Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: May 07, 2026 | 2:05 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. చాలా కాలంగా సినిమాలు తగ్గించారు. నటులు ముందే సంభాషణలు, సన్నివేశాల కోసం సిద్ధమై వచ్చినా, సెట్‌లో కృష్ణవంశీ పద్ధతి భిన్నంగా ఉంటుంది. “ఇది కాదు, ఇది ఇలా చేద్దాం” అంటూ అప్పటికప్పుడు మార్పులు చేయటం ఆయన శైలి. ఈ విధానం కొంతమంది నటులకు కొత్తగా అనిపించినా, వారితో సింక్ అవ్వడానికి రెండు, మూడు రోజులు పడుతుందని ఆయన వివరించారు. రామ్ చరణ్ విషయంలో కూడా మొదటి రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి ఎదురైందని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అయితే, నాలుగైదు రోజుల తర్వాత చరణ్‌కు కృష్ణవంశీ శైలి అర్థమై, అలవాటైందని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

“రాఖీ” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కోర్టు సీన్ డైలాగ్ కూడా స్పాట్ ఇంప్రోవైజేషన్‌లో భాగంగానే రూపొందిందని కృష్ణవంశీ వెల్లడించారు. ఈ డైలాగ్ కోసం ముందుగా పరుచూరి గోపాలకృష్ణతో ఒక వెర్షన్ రాయించి, ఆ తర్వాత ఉత్తేజ్‌తో మరో వెర్షన్ సిద్ధం చేయించారట. ఈ రెండింటినీ పరిశీలించి, వాటిలోని మంచి కంటెంట్‌ను స్వీకరించి, తనదైన శైలిలో మార్పులు చేసుకొని ఫైనల్ డైలాగ్‌ను సిద్ధం చేశానని కృష్ణవంశీ చెప్పారు. ముఖ్యంగా ఉత్తేజ్ రాసిన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ఈ డైలాగ్‌ను జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించిన తర్వాత, తారక్ రిపీట్ చేస్తున్నప్పుడు కూడా కరెక్షన్లు చేశారట. “ఇది వద్దు, ఇది చెయ్యి, ఇక్కడ ఈ మాట కూడా చెప్పు” అంటూ సూచనలు ఇచ్చారట.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

దాదాపు 10 నిమిషాల నిడివి గల ఆ క్లైమాక్స్ డైలాగ్‌ను జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఒక్కటే టేక్‌లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారని అన్నారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, సుహాసిని కూడా అక్కడే ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పగానే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయని, వెంటనే కళ్ళు తుడుచుకుని పక్కకు వెళ్లిపోయారని కృష్ణవంశీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకశక్తి “రాక్షసుడు” అని, అంత అద్భుతమైన మెమరీ ఏ హీరోకు లేదని కృష్ణవంశీ అన్నారు. మహేష్ బాబుకు కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని, ప్రకాష్ రాజ్‌కు కూడా సూపర్బ్ మెమరీ ఉందని ఆయన పేర్కొన్నారు. తక్కువ మంది హీరోలతో పనిచేయడం వల్ల ఇంత పెద్ద డైలాగ్‌లు మిగిలిన హీరోలపై ప్రయత్నించలేదని కృష్ణవంశీ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Follow Us