చదివింది ఇంటర్.. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

07 May 2026

సినిమా రంగంలో రాణించాలంటే కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు, అంకితభావం కూడా ఉండాలని నిరూపించిన నటి అదా శర్మ.

'ది కేరళ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విద్యాభ్యాసం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది.

ముంబైలోని తమిళ కుటుంబంలో జన్మించిన అదా శర్మకు చిన్నప్పటి నుంచే కళల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆమె తన పాఠశాల విద్యను పూర్తి చేశారు.

పదవ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె నటి కావాలనుకుంది. అయితే, కనీసం పాఠశాల విద్యను పూర్తి చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరడంతో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశారు.

ఆ తర్వాత డిగ్రీలో చేరకుండా తన పూర్తి సమయాన్ని నటన, డ్యాన్స్ కోసం కేటాయించారు. చదువును మధ్యలోనే ఆపేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

ముంబైలోని గోపీ కృష్ణ కథక్ డాన్స్ అకాడమీ నుండి కథక్ నృత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం కథక్ మాత్రమే కాకుండా సల్సా, బెల్లీ డాన్స్ నేర్చుకుంది.

2008లో '1920' అనే హిందీ హారర్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అదా, తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు