AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత క్రికెట్‌లో విషాదం.. విరాట్ కోహ్లీ స్నేహితుడు, మాజీ క్రికెటర్ కన్నుమూత..!

Amanpreet Singh Gill Death: పంజాబ్ కింగ్స్‌తోపాటు టీమిండియా తరపున ఆడిన మాజీ ప్లేయర్ అమన్‌ప్రీత్ మరణించాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఈమేరకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తమ మాజీ ఆటగాడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కూడా నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Venkata Chari
|

Updated on: May 07, 2026 | 12:25 PM

Share
భారత క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ సన్నిహిత మిత్రుడు, మాజీ క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కేవలం 36 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారు. అండర్-19 జట్టులో కోహ్లీతో కలిసి ఆడిన ఈ ప్రతిభావంతుడైన బౌలర్ అకాల మరణం క్రీడాకారులను,  అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

1 / 5
భారత అండర్-19 జట్టు మాజీ ఆటగాడు, ఐపీఎల్ మాజీ క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ బుధవారం చండీగఢ్‌లో కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కేవలం 36 ఏళ్ల ప్రాయంలోనే ఆయన మరణించడంతో క్రికెట్ ప్రపంచం మూగబోయింది. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటూ, క్రమశిక్షణ కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణం పంజాబ్ క్రికెట్‌కు తీరని లోటుగా పరిగణించబడుతోంది.

2 / 5
అమన్‌ప్రీత్ సింగ్ గిల్ తన క్రికెట్ ప్రయాణాన్ని విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో కలిసి ప్రారంభించాడు. భారత అండర్-19 జట్టులో వీరు ఇద్దరూ కలిసి ఆడారు. 2007లో అమన్‌ప్రీత్ భారత యువ జట్టు తరపున ఐదు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో శ్రీలంకకు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ తిసారా పెరీరా వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, దురదృష్టవశాత్తూ 2008 ప్రపంచకప్ గెలిచిన కోహ్లీ నేతృత్వంలోని జట్టులో ఆయనకు చోటు లభించలేదు.

3 / 5
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్‌లో ఆయన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా క్రీడపై ఉన్న మక్కువతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ఎంపిక కమిటీ సభ్యుడిగా సేవలందించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

4 / 5
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. "అమన్‌ప్రీత్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. మేం కెరీర్ ప్రారంభంలో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. అతను ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న ఆటగాడు" అని పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా తమ మాజీ ఆటగాడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

5 / 5
Follow Us
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్

సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!

రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై

అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్

నేను పలకరించలేదని ఆ హీరో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు..

వేసవిలో కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?

వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల

పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?

ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?

పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి