ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. ఆ మూవీ నా లైఫ్ మార్చేసింది.. అనుష్క
Rajitha Chanti
Pic credit - Instagram
07 May 2026
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. 'అరుంధతి', 'బాహుబలి' వంటి చిత్రాలతో తిరుగులేని స్టార్‌డమ్ అందుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.
అనుష్క కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత తిరిగి సాధారణ స్థితికి రావడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది.
"బరువు పెరగడం సులభమే కానీ, మళ్లీ తగ్గడం అంత తేలిక కాదు. ఆ సమయంలో నేను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
కానీ యోగా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నన్ను మళ్లీ గాడిలో పెట్టాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. బరువు తగ్గడం కోసం ఆమె పడ్డ కష్టాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి.
గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, అనుష్కకు సాధారణ జీవితం గడపడం అంటేనే ఇష్టం. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆమె చాలా స్పష్టంగా ఉంటారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హడావిడి చూసి తనకు సినిమాలు సెట్ కావనుకున్నారట. దీంతో తిరిగి వెళ్లిపోయి యోగా టీచర్‌గా కెరీర్ కొనసాగిద్దామనుకుందట.
కానీ అరుంధతి సినిమా తన జీవితాన్ని మార్చేసిందని అన్నారు. ఆ సినిమా వల్లే తాను ఇప్పుడు సినీరంగంలో ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు అనుష్క శర్మ.