హైదరాబాద్లో మహిళల భద్రతపై దృష్టి పెట్టిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద సాధారణ ప్రయాణికురాలిగా నిలబడి మహిళలు ఎదుర్కొనే వేధింపులను స్వయంగా పరిశీలించారు. ఆమె పోలీస్ అధికారి అని తెలియని కొందరు ఆకతాయిలు వేధించగా, ముందుగానే నిఘా పెట్టిన పోలీసులు రంగంలోకి దిగి 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.