AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థానిక మహిళలకు అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు

Telangana Anganwadi Recruitment 2026: రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా ఆదిలాబాద్‌ మరియు కామారెడ్డి జిల్లాల్లో కూడా నియామకాల కోసం ప్రకటనలు జారీ అయ్యాయి. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి..

స్థానిక మహిళలకు అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు
Adilabad And Kamareddy Anganwadi Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 3:53 PM

Share

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వమోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా అంగన్వాడి టీచర్‌, ఆయాల పోస్టుల భర్తీకి మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రేవంత్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జిల్లాల్లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆదిలాబాద్‌ అంగన్వాడీల్లో 242 పోస్టులను, కామారెడ్డి జిల్లాలో 190 (టీచర్లు 95, హెల్పర్‌ 95) టీచర్‌, హెల్పర్‌ పోస్టులనుఈ నోటిఫికేషన్‌ల కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

కామారెడ్డి జిల్లా ఐసీడీఎస్‌లలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య..

  • బాన్స్‌వాడ పోస్టుల సంఖ్య: 46
  • దోమకొండ పోస్టుల సంఖ్య: 41
  • కామారెడ్డి పోస్టుల సంఖ్య: 26
  • మద్నూర్‌ పోస్టుల సంఖ్య: 35
  • ఎల్లారెడ్డి పోస్టుల సంఖ్య: 42

ఆదిలాబాద్‌ జిల్లా ఐసీడీఎస్‌లలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య..

  • గాదిగూడ పోస్టుల సంఖ్య: 57
  • నార్నూర్‌ పోస్టుల సంఖ్య: 51
  • ఇంద్రవెల్లి పోస్టుల సంఖ్య: 36
  • ఉట్నూర్‌ పోస్టుల సంఖ్య: 98

అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదివిన వారు అందుబాటులో లేకపోతే పదో తరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం ఇలా..

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)..అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది. ఎంపికలో ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.

తెలంగాణ కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా అంగన్వాడిల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us