భారత్‌ను హెచ్చరించిన ఉగ్రవాది అదిల్ అహ్మద్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30కి పైగి సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. దాడి చేసింది మేమేనని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. అయితే ఉగ్రవాది అదిల్ అహ్మద్‌కు సంబంధించిన ఒక వీడియోను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. ఆ వీడియోలో ఉగ్రవాది అదిల్ అహ్మద్ మాట్లాడుతూ.. […]

భారత్‌ను హెచ్చరించిన ఉగ్రవాది అదిల్ అహ్మద్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30కి పైగి సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. దాడి చేసింది మేమేనని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు.

అయితే ఉగ్రవాది అదిల్ అహ్మద్‌కు సంబంధించిన ఒక వీడియోను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. ఆ వీడియోలో ఉగ్రవాది అదిల్ అహ్మద్ మాట్లాడుతూ.. భారత్ పిచ్చి భ్రమలు మానుకోవాలని హెచ్చరించాడు. తమవారిని కొంతమందిని చంపినంత మాత్రాన బలహీనపడిపోతామన్న పిచ్చి భ్రమలు మానుకోవాలన్నాడు.

తాను ఏడాదిపాటు జేఈఎంలో పనిచేస్తున్నానని, ఈ వీడియోను అందరూ చూసే సరికి తాను స్వర్గంలో ఉంటానని చెప్పాడు. భారత్‌కు వ్యతిరేకంగా దక్షిణ కశ్మీర్ ప్రజలు పోరాడుతున్నారని.. ఉత్తర, మధ్య కశ్మీర్ ప్రజలతోపాటు జమ్ము ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పాడు.

Published On - 10:03 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu