Temperature Dipped : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో మంచు జల్లులు కురిశాయి. చలి పంజాలో మన్యం గజగజ వణుకుతోంది. పొగమంచు దట్టంగా కమ్మేసింది. మినుములూరు...

Temperature Dipped : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Follow us

|

Updated on: Jan 10, 2021 | 7:28 PM

Temperature Dipped : విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో మంచు జల్లులు కురిశాయి. చలి పంజాలో మన్యం గజగజ వణుకుతోంది. పొగమంచు దట్టంగా కమ్మేసింది. మినుములూరు 7, పాడేరు 8 డిగ్రీలు కనీస ఉష్ణోగ్రత నమోదైంది. మంచు కప్పేస్తున్న కారణంగా.. రహదారిపై రాకపోకలు ఇబ్బందిగా మారాయి. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాడేరు పట్టణం మంచు ముసుగులో ఉంది. మండలంలో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. ఏదీ కనిపించకుండా… మొత్తం పొగ మంచుతో కప్పేసింది. పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచు తీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం ఉదయం 9 గంటల వరకు పట్టణంలో మంచు వీడలేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం10 గంటల వరకు దట్టంగా మంచు కమ్మేసింది.

విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 7 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 7 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీలో గిరిజనులు గజగజా వణుకుతున్నారు.