కొంపముంచిన కామక్రీడ.. శృంగారంలో పీక్స్ చేరాలని ప్రియుడిని నైలాన్ తాడుతో కట్టింది.. తీరా చూస్తే.!
Nagpur Man Dies: ఈ మధ్యకాలంలో ప్రేయసీ ప్రియులు శృంగారంలో హద్దులు దాటి మరీ స్వర్గసుఖలను పొందాలని ఆరాటపడుతుంటారు...
Nagpur Man Dies: ఈ మధ్యకాలంలో ప్రేయసీ ప్రియులు శృంగారంలో హద్దులు దాటి మరీ స్వర్గసుఖలను పొందాలని ఆరాటపడుతుంటారు. లైంగికంగా మరింత సుఖం పొంది శృంగారాన్ని ఎంజాయ్ చేసేందుకు వెరైటీ పద్దతులను కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్నిసార్లు వాళ్లు చూపించే అత్యుత్సాహమే తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి నాగ్‌పూర్‌లో తాజాగా చోటు చేసుకుంది. నైలాన్ తాడు మెడకు చుట్టుకుని ఓ యువకుడు విగతజీవిగా మారాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల జియుద్దిన్ అన్సారికి స్థానికంగా ఉండే మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ గురువారం రాత్రి ఖపర్ఖేడాలోని ఓ లాడ్జ్‌కు వెళ్లారు. ఆ ఇద్దరూ లైంగికంగా మరింత సుఖం పొందేందుకు శృంగారం సమయంలో ఓ పద్దతిని అనుసరించారు. అందులో భాగంగానే ఆ యువకుడిని సదరు మహిళ నైలాన్ తాడుతో కుర్చీకి కట్టేసింది. అంతటితో ఆగకుండా ‘లైంగిక ప్రేరేపణ’ను మరింత పెంచేందుకు మరో తాడును అతడి మెడ చుట్టూ బిగించింది.
ఆ యువకుడు కుర్చీలో అలాగే ఉండగా.. మహిళ వాష్‌రూమ్‌కు వెళ్ళింది. అప్పుడు కుర్చీ జారి పడటంతో.. మెడ చుట్టూ ఉన్న తాడు ఆ యువకుడికి ఉచ్చులా బిగుసుకుంది. దీనితో అతడు ఊపిరాడక చనిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను అదుపులోకి తీసుకుని.. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఇక విచారణ సమయంలో అతడితో తనకు ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆ మహిళ అంగీకరించింది. లాడ్జ్ మేనేజర్, వెయిటర్లు, రూమ్ సర్వీస్ సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం సదరు మహిళ, మరణించిన వ్యక్తి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, చనిపోయిన వ్యక్తి బంధువులు మాత్రం ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని.. సదరు మహిళ పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిందని ఆరోపిస్తున్నారు.