డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ టీం దూసుకుపోతుంది. నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో దుమ్ము దులిపేసింది. కెప్టెన్ అఖిల్ స్టాప్ ప్లేయర్ తమన్ అండ్ అశ్విన్ ధాటికీ పంజాబ్ ది షేర్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇప్పటికే నాలుగు సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న తెలుగు వారియర్స్ ఐదోసారి ట్రోఫీ కోసం వేట మొదలుపెట్టింది. ఐదోసారి ట్రోఫీ గెలవాలని హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న మ్యాచ్లో గెలిచి తమ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇవ్వాలని ఆశిస్తోంది.
ఇందులో భాగంగా శుక్రవారం పంజాబ్‌తో తలపడిన తెలుగు వారియర్స్ నరాలు తెగే ఉత్కంఠలో పంజాబ్‌పై విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్‌కి దీటుగా సమాధానం ఇచ్చేందుకు హీరో అశ్విన్ ప్రయత్నించి లీడ్ తీసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ 106 టార్గెట్‌తో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాద్ షా ఆఫ్ మ్యాచ్‌గా నిలిచారు.
మొదటి ఇన్నింగ్స్‌లో సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అశ్విన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్ మడతపెట్టిన తమన్ చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ9తో మాట్లాడిన తమన్, అశ్విన్ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. అశ్విన్ అన్న డైరెక్టర్ ఓంకార్ టీవీ9తో మాట్లాడుతూ ఇప్పటి వరకు పంజాబ్‌పై తెలుగు వారియర్స్ గెలిచింది లేదు అని.. సినిమా క్లైమాక్స్‌ని తలపించేలా సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరిగిందని అన్నారు. ఒకానొక సమయంలో మ్యాచ్ ఓడిపోయే స్టేజ్‌లో ఉన్నామని.. తమన్, అశ్విన్, అఖిల్ టీం సపోర్ట్‌తో మ్యాచును మలుపు తిప్పారని ఓంకార్ అన్నారు. మిగతా టీమ్స్‌తో పోల్చితే తెలుగు వారియర్స్ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాక్టీస్ చాలా తక్కువగా చేసినా మ్యాచుల్లో మాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ గెలుస్తున్నారని అన్నారు. ఈసారి కూడా తప్పకుండా ట్రోఫీని గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు తెలుగు సినిమా సెలబ్రిటీస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..