AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయుగుండంగా మారిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని […]

వాయుగుండంగా మారిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Ram Naramaneni
|

Updated on: Aug 06, 2019 | 6:07 PM

Share

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే మంగళ, బుధవారాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలోని చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు.

Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?