YS Sharmila: తండ్రి బాటలో తనయ.. నేటి నుంచి పాదయాత్రను షురూ చేయనున్న షర్మిల.. 4వేల కి. మీ పాదయాత్ర

YS Sharmila Pada Yatra:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేతవైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు..

YS Sharmila: తండ్రి బాటలో తనయ.. నేటి నుంచి పాదయాత్రను షురూ చేయనున్న షర్మిల.. 4వేల కి. మీ పాదయాత్ర
Ys Sharmila
Follow us

|

Updated on: Oct 20, 2021 | 12:57 PM

YS Sharmila Pada Yatra:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేతవైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడు ఏళ్లుగా తెలంగాణాలో  7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ,  ప్రజల సమస్యలను అర్థంచేసుకుని వాటికీ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి షర్మిల పాదయాత్రను చేయనున్నారని పార్టీ నేతలు చెప్పారు. చేవెళ్ల వేదికగా వైఎస్ షర్మిల ఈ రోజు ప్రారంభించనున్న పాదయాత్ర 400 రోజుల్లో 4,000 కి.మీ. మేర సాగనుంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం జులై 8నే పాదయాత్ర ఉంటుందని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2012లో తండ్రి వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టిన చోట నుంచే వైఎస్ షర్మిళ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో జరుగుతున్న తొలి రోజు పాదయాత్రలో భాగంగా..  షర్మిల వికారాబాద్ రోడ్డులోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఉదయం 11గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ముగిసిన అనంతరం షర్మిల పాదయాత్రను షురూ చేయనున్నారు. కందవాడ-నక్కలపల్లి శివారుకు చేరుకున్న షర్మిల రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపిందించారు. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధిం రాంరెడ్డి తెలిపారు. తొలి రోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాట వెంట్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానించారు.

Also Read: వ్యాక్సిన్ వేయించుకున్నామని కోవిడ్ నిబంధనలకు గుడ్ బై.. మళ్ళీ రోజుకు 50 వేల కేసులు నమోదు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!