ఆస్తి పన్ను రాయితీ ఉత్తర్వులు జారీ, ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు
జీహెచ్ ఎంసీ పరిధిలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 2020-21 సంవత్సరానికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు దీపావళి సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
జీహెచ్ ఎంసీ పరిధిలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 2020-21 సంవత్సరానికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు దీపావళి సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా 31.40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఒకవైపు కోవిడ్.. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడ్డ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు 50% ఆస్తి పన్ను రాయితీ ఊరటగా ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి జారీ చేశారు.
ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీలో రూ.15వేల లోపు, ఇతర పట్టణాల్లో రూ.10వేల లోపు ఇంటి పన్ను కట్టేవారికి సగం రాయితీ ఇస్తారు. ఒక వేళ ఇప్పటికే ఇంటి పన్ను చెల్లించి ఉంటే వచ్చే సంవత్సరం ఆ మేరకు సర్దుబాటు చేస్తారు. రాయితీ మొత్తాన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వనుంది.
Also Read :
పిఠాపురంలో అగ్నిప్రమాదం..తారాజువ్వ పడి కోళ్ల ఫారం దగ్ధం, అగ్నికి ఆహుతైన 1200 కోళ్లు
తెలంగాణలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 661 పాజిటివ్ కేసులు, 3 మరణాలు
కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !