తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవమిది.. గోరెటి వెంకన్నపై కేటీఆర్ ట్వీట్‌

తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ప్రజాగాయకుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవమిది.. గోరెటి వెంకన్నపై కేటీఆర్ ట్వీట్‌
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2020 | 11:22 AM

KTR wishes Goreti Venkanna: తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ప్రజాగాయకుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. (శబ్ద, వాయు కాలుష్యానికి నా వంతు బాధ్యత నిర్వర్తించా.. వర్మ దీపావళి సెలబ్రేషన్స్‌)

”తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం” ఇది అన్నారు. మరో ట్వీట్‌లో ”గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్న గారిని సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్ గారికి వందనాలు” అని పెట్టారు. (సంజయ్‌ దత్‌ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌)

ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన బస్వరాజు సారయ్య, ప్రముఖ సంఘసేవకులు, ఆర్యవైశ్య ప్రతినిధి శ్రీ భోగారపు దయానంద్‌లకు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ గారికి కూడా కృతఙ్ఞతలని చెప్పారు. (తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!)