AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రతి నెలా ఒకటో తేదీనే అకౌంట్లోకి డబ్బులు

తెలంగాణ ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ప్రతినెలా 1వ తేదీన వారి వేతనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానునున్నట్టు తెలిపింది. వేతన చెల్లింపుల్లో పారదర్శకత, సమయపాలన లక్ష్యంగా ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే పలువురు ఉద్యోగులకు వేతనాలు జమ కాగా, సాంకేతిక కారణాలతో ఆలస్యమైన టీవీవీపీ ఉద్యోగులకు త్వరలో అందుతాయి.

వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రతి నెలా ఒకటో తేదీనే అకౌంట్లోకి డబ్బులు
Telangana Health Department Salaries
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 8:58 PM

Share

రాష్ట్రంలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వేతనాల చెల్లింపులో సమయపాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

ఈ కొత్త విధానంలో భాగంగా తొలిసారిగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, హానరేరియం ఉద్యోగుల వేతనాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో వేతనాల జమ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా కొనసాగనుంది.ఈ నెల నుంచే ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు జమ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ పరిధిలోని అధిక శాతం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యాయి.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సుమారు 1,700 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు డీబీటీ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తున్న నేపథ్యంలో తలెత్తిన స్వల్ప సాంకేతిక కారణాల వల్ల ఈ నెల వేతనాల జమ సోమవారం జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీవీవీపీ అధికారులు పూర్తి చేయగా, సంబంధిత బిల్లులకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఆయా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us