రోజుకో యాపిల్ తింటే షుగర్ వ్యాధి తగ్గుతుందా?

05 July 2026

TV9 Telugu

TV9 Telugu

రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. శాస్త్రీయ ఆధారాలు కూడా కొంతవరకు దీన్ని నమ్ముతున్నాయి

TV9 Telugu

యాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి

TV9 Telugu

సమతుల ఆహారంలో భాగంగా యాపిల్‌ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నుంచి గుండె ఆరోగ్యం వరకు పలు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది

TV9 Telugu

యాపిల్‌లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, రైబోఫ్లావిన్ వంటి విటమిన్లతోపాటు కాపర్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం రోజువారీ ఫైబర్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. దీనిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది

TV9 Telugu

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా యాపిల్ మంచి ఎంపికగా నిలుస్తుంది

TV9 Telugu

ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది

TV9 Telugu

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాపిల్‌లోని పాలీఫెనాల్స్ కొంతవరకు సహాయపడతాయ‌ని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి