ఇది నోట్లో పెట్టుకుని పడుకుంటే కమ్మని నిద్ర పడుతుందా?

05 July 2026

TV9 Telugu

TV9 Telugu

లవంగాన్ని నోటిలో ఉంచుకొని పడుకుంటే.. కమ్మటి నిద్ర పట్టేస్తుందని సోషల్‌ మీడియాలో రీల్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి

TV9 Telugu

అయితే వాటిని గుడ్డిగా నమ్మేస్తూ.. కొందరు ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని మీకు తెలుసా..

TV9 Telugu

రాత్రిపూట లవంగాన్ని నోట్లో పెట్టుకొని పడుకోవడం అంత మంచిదికాదని చెబుతున్నారు. లవంగాన్ని నోటిలో ఉంచుకుని నిద్రపోవడం వల్ల.. అది శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంది

TV9 Telugu

దాంతో ఊపిరి ఆడకపోవడం, ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇక చాలా ఘాటుగా ఉండే లవంగాన్ని నోటిలోనే ఎక్కువసేపు ఉంచుకోవడం మంచిదికాదు

TV9 Telugu

అలాచేస్తే.. బుగ్గ లోపలి భాగం, నాలుక కాలినట్లు అవ్వడం, నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది. లవంగం తక్కువ మోతాదులో తీసుకుంటేనే సురక్షితం

TV9 Telugu

అధికంగా వాడటం వల్ల నోటిలో మంట, కడుపులో అసౌకర్యం, అలెర్జీలు కలగవచ్చు. అయితే, లవంగాలలో ఉండే కొన్ని గుణాలు పరోక్షంగా మంచి నిద్రకు సహాయపడతాయట

TV9 Telugu

లవంగాలలో ‘యూజినాల్‌’ అనే యాంటి సెప్టిక్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని నమలడం, దాని సువాసనను పీల్చడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది

TV9 Telugu

లవంగం ప్రయోజనాలను పొందాలనుకుంటే.. పడుకోవడానికి ఒక అరగంట ముందు ఒక లవంగాన్ని నమిలి, ఆ రసాన్ని మింగేయాలి. ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి