Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందా? నిజమిదే
హిందూ సాంప్రదాయంలో , వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉపయోగించే ప్రతి చిన్న వస్తువుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత , విశిష్టత ఉంది. వాటిలో మనం ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు అత్యంత ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం, చీపురును కేవలం చెత్తను ఊడ్చే ఒక సాధారణ సాధనంగా మాత్రమే చూడకూడదు. దాన్ని సాక్షాత్తు సంపద , అదృష్ట దేవత అయిన 'మహాలక్ష్మి' స్వరూపంగా, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో చీపురును ఎలా ఉపయోగించాలి, ఎక్కడ దాచాలి అనే విషయాలను తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉపయోగించే ప్రతి చిన్న వస్తువుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత , విశిష్టత ఉంది. వాటిలో మనం ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు ముఖ్యమైనది. వాస్తు శాస్త్ర నిపుణుల వివరాల ప్రకారం, చీపురును మనం ఉంచే విధానం , ఉపయోగించే సమయాన్ని బట్టే ఇంట్లోకి సానుకూల లేదా ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాలుతో చీపురును తాకితే ఏమవుతుంది? చీపురును లక్ష్మీదేవి సాక్షాత్తు శక్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దాన్ని ఎన్నడూ పాదాలతో తాకకూడదు, తొక్కకూడదు లేదా దాటకూడదు. ఒకవేళ పొరపాటున కాలు తగిలినా లేదా అడుగు పడినా లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి, ధన నష్టం , దారిద్య్రం ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా కాలు తగిలితే వెంటనే ఆ చీపురును చేత్తో తాకి కళ్లకు అద్దుకుని, సాష్టాంగ నమస్కారం చేస్తూ మనసులోనే క్షమాపణలు చెప్పుకోవాలి.
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఎందుకు ఊడ్చకూడదు? సాయంత్రం లేదా సూర్యాస్తమయం (చీకటి పడిన) తర్వాత ఇల్లు ఊడవడం అత్యంత అశుభకరమైన చర్యగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, సూర్యాస్తమయ సమయం అనేది లక్ష్మీదేవి మన ఇళ్లలోకి ప్రవేశించే పవిత్రమైన సమయం. ఆ సమయంలో ఇల్లు ఊడ్చి చెత్తను బయట పారేయడం అంటే, ఇంట్లో ఉండే లక్ష్మిని మనమే చేతులారా బయటకు పంపేయడంతో సమానం. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుందని, ఫలితంగా ఆర్థిక కష్టాలు , అప్పుల బాధలు పెరుగుతాయని నమ్ముతారు. అత్యవసర పరిస్థితి వస్తే కేవలం ఊడ్చి ఒక మూలకు పెట్టాలి కానీ సాయంత్రం వేళల్లో చెత్తను బయట పారేయకూడదు.
డబ్బు లాగే చీపురును కూడా ఎందుకు దాచాలి? వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాడే చీపురు బయటి నుండి వచ్చే అతిథులు లేదా ఇతరుల కంటికి నేరుగా కనిపించేలా అస్సలు ఉంచకూడదు. మనం సంపాదించిన డబ్బును, నగలను బీరువాలో ఎంత భద్రంగా దాచుకుంటామో, చీపురును కూడా ఇతరుల దృష్టి పడకుండా ఇంట్లో ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచాలి. చీపురు నిరంతరం అందరికీ కనిపిస్తూ ఉంటే ఇంట్లోని సానుకూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇతరుల చెడు దృష్టి (దిష్టి) చీపురుపై పడటం వల్ల ఇంటి శ్రేయస్సు క్షీణించి, అనవసరమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
చీపురును ఉంచడానికి సరైన దిశ ఏది? ఇంట్లో చీపురును ఉంచడానికి దక్షిణ, పడమర లేదా నైరుతి దిశలు అత్యంత అనుకూలమైనవి. చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో, వంటగదిలో లేదా ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. వంటగదిలో చీపురు పెడితే అన్నపానీయాలకు లోటు ఏర్పడుతుందని, పూజగదిలో పెడితే దైవకటాక్షం తగ్గుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిటారుగా పెట్టకూడదు – విరిగిన చీపురు వాడకూడదు నిలువుగా పెట్టడం తప్పు: చీపురును ఎప్పుడూ గోడకు ఆనించి నిటారుగా నిలబెట్టకూడదు. వాస్తు ప్రకారం అలా నిలబెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన అభిప్రాయ భేదాలు, గొడవలు , శత్రుత్వాలు తలెత్తుతాయి. దాన్ని ఎల్లప్పుడూ నేలపై అడ్డంగా (పడుకోబెట్టినట్లు) మాత్రమే ఉంచాలి.
పాత , విరిగిన చీపురు: విరిగిన, నలిగిపోయిన లేదా చాలా పాతదైన చీపురును ఇంట్లో ఉపయోగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది నేరుగా ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి విరిగిన వెంటనే దాన్ని మార్చి కొత్తది ఉపయోగించాలి.
కొత్త చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాత ఇంట్లో వాడిన పాత చీపురును తీసుకెళ్లకూడదు, ఎందుకంటే అది పాత ప్రతికూలతలను కొత్త ఇంట్లోకి కూడా తిరిగి తెస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త చీపురును మార్కెట్లో కొనుగోలు చేయడానికి శనివారం అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. శనివారం రోజు కొత్త చీపురును తెచ్చి ఇంట్లో పూజించి వాడటం వల్ల శనిదోషాలు తొలగిపోవడంతో పాటు ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి స్థిరంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో అందించబడిన వాస్తు సమాచారం , జ్యోతిష్య సూచనలు కేవలం భారతీయ సాంప్రదాయ వాస్తు శాస్త్ర గ్రంథాలు, నిపుణుల నివేదికలు , సాధారణ అవగాహన ఆధారంగా సేకరించబడినది మాత్రమే. ఇది వృత్తిపరమైన వాస్తు కన్సల్టెన్సీకి సంపూర్ణ ప్రత్యామ్నాయం కాదు. మీ ఇంటి నిర్మాణం , వ్యక్తిగత నమ్మకాలను బట్టి అవసరమైన మార్పులు చేసుకోవాల్సిందిగా మనవి.
