అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కరోనా పరీక్షలు : ఈటెల

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కొవిడ్ పరీక్షలు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లో వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కరోనా పరీక్షలు : ఈటెల
Follow us

|

Updated on: Jun 30, 2020 | 8:26 PM

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కొవిడ్ పరీక్షలు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇందుకోసం హైదరాబాద్ లోని 11 సెంటర్లో పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అన్ని జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లో వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

GHMC పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో సర్వెలేన్స్ పెంచాలని మంత్రి ఆదేశించారు. డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సూచించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి నీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉండే పాజిటివ్ పేషేంట్స్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని సూచించిన మంత్రి.. వారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇంటి వద్దకే వైద్యులను పంపించాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కోరతపై మంత్రి చర్చించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరమైన పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని మంత్రి ఈటెల అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క ఆస్పత్రిలో పరికరాలు, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఇక, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ప్రతి పేషంట్ ను డాక్టర్, నర్స్ తప్పకుండా రోజుకి మూడు సార్లు పరీక్ష చేయాలని, పేషంట్ కి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి.

హైదరాబాద్ లో కరోనా పరీక్ష  కేంద్రాలు

కింగ్ కోఠి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి- ఎర్రగడ్డ, నేచర్ క్యూర్ హాస్పిటల్- అమీర్ పేట్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి- మేహదీపట్నం, ఆయుర్వేద ఆసుపత్రి- ఎర్రగడ్డ, హోమియో పతి ఆసుపత్రి- రామంతపూర్, నిజామియా టీబీ ఆసుపత్రి- చార్మినార్, ఏరియా హాస్పటల్- కొండాపూర్, ఏరియా ఆసుపత్రి- వనస్థలి పురం, నాచారం ESI ఆసుపత్రి, సరూర్ నగర్ ESI ఆసుపత్రి లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఈటెల వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు టెస్టింగ్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక, పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని, పరీక్ష కేంద్రంలో విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు. లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.