‘దక్కన్‌’ పై వేటు పడింది…

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఓ కార్పొరేట్ ఆసుపత్రిపై వేటు వేసింది. హైదరాబాద్ సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిలో కొవిడ్-19 వైద్యం చేయడాన్ని రద్దు చేసింది. ఇటీవల దక్కన్ ఆసుపత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దవాఖాన వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం. అధిక బిల్లు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. 48 గంటల్లో పూర్తి నివేదికను అందజేయాలని హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు. […]

'దక్కన్‌' పై వేటు పడింది...

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఓ కార్పొరేట్ ఆసుపత్రిపై వేటు వేసింది. హైదరాబాద్ సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిలో కొవిడ్-19 వైద్యం చేయడాన్ని రద్దు చేసింది. ఇటీవల దక్కన్ ఆసుపత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దవాఖాన వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం. అధిక బిల్లు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. 48 గంటల్లో పూర్తి నివేదికను అందజేయాలని హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

ఇటీవలే సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు దక్కన్ ఆసుపత్రిపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షలు కట్టినా మృతదేహం అప్పగించేందుకు మరో రూ.2 లక్షలు అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.

సత్యనారాయణరెడ్డి కొడుకు రాధేశ్‌ ట్విట్టర్‌ ద్వారా మొర పేర్కొన్నారు. దీంతో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సరైన చికిత్స అందించని, బాధ్యతగా వ్యవహరించని ఆ ప్రైవేటు ఆస్పత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ప్రైవేటు దవాఖానలు ఎక్కువ వసూలు చేస్తుండటంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దక్కన్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రుల జాబితా నుంచి తొలలగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu