”సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య”!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో పని చేసే ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మృతిపై ఓ సంచలన వీడియోను విడుదల చేశారు.

  • Updated On - 6:20 am, Tue, 4 August 20
''సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య''!

Sushant Singh Rajput’s Not Suicide: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో పని చేసే ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మృతిపై ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్యేనంటూ అందులో ఆమె పేర్కొన్నారు.

సుశాంత్ ముఖంతో పాటు ఇతర ప్రదేశాల్లో గాయాలున్నాయని.. అతన్ని కొట్టి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని మీనాక్షి మిశ్రా అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు అసలు సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. హత్యేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు. మొత్తంగా 26 కారణాలు చూపిస్తూ.. ప్రూఫ్స్‌తో సహా ట్వీట్ చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని సుశాంత్ ది హత్యేనని చెబుతున్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. అయితే సుశాంత్‌కు వైద్యం చేసిన డాక్టర్లు మాత్రం అతను డిప్రెషన్‌తోనే చనిపోయారని.. రియా చివరి వరకు అండగా ఉందని అంటున్నారు.