ఆ ఊర్లో రాఖీ పండుగ‌ జ‌రిగితే.. శ‌వాలు లేస్తాయ‌ట‌!

ఆ ఊర్లో రాఖీ పండుగ‌ జ‌రిగితే.. శ‌వాలు లేస్తాయ‌ట‌!

రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల‌కు, అక్కా త‌మ్ముళ్ల‌కు ఎంతో ఇష్టం. ఈ పండుగ వ‌స్తే ప్ర‌తీ ఇంట్లోనూ సంద‌డి నెల ‌కొంటుంది. దూర ప్ర‌యాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా.. రాఖీ క‌ట్టేందుకు అన్నా, త‌మ్ముళ్ల ఇంటికి చేరుకుంటారు సోద‌రీమ‌ణులు. తోడ బుట్టిన వారికే కాకుండా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 10:09 PM

రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల‌కు, అక్కా త‌మ్ముళ్ల‌కు ఎంతో ఇష్టం. ఈ పండుగ వ‌స్తే ప్ర‌తీ ఇంట్లోనూ సంద‌డి నెల ‌కొంటుంది. దూర ప్ర‌యాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా.. రాఖీ క‌ట్టేందుకు అన్నా, త‌మ్ముళ్ల ఇంటికి చేరుకుంటారు సోద‌రీమ‌ణులు. తోడ బుట్టిన వారికే కాకుండా.. వ‌రుస‌కు అన్న లేదా త‌మ్ముడు అయిన ప్ర‌తీ వారికీ రాఖీని క‌ట్టి వారి ప్రేమ‌ను చాటుకుంటూంటారు మ‌గువ‌లు. ఈ పండుగ‌ను భార‌తీయులంతా ఇంటి వ‌ద్ద‌నే ఉండి సెల‌బ్రేట్ చేసుకుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం రాఖీ పండుగ‌ను 65 సంవ‌త్స‌రాలుగా జ‌రుపుకోవ‌ట్లేద‌ట‌. ఒక‌వేళ పొర‌పాటున చేసినా.. ఆ ఊర్లో శ‌వాలు లేస్తాయ‌ని ఆ గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర ‌ప్ర‌దేశ్‌లోని వ‌జీరాగంజ్ పంచాయ‌తీలోని జ‌గ‌త్‌పూర్వ‌లో రక్షా బంధ‌న్‌ని గ‌త 65 సంవ‌త్స‌రాలుగా జ‌రుపుకోవ‌ట్లేదు. రాఖీ పండుగ జ‌రుపుకుంటే అన‌ర్థాలు జ‌రుగుతాయ‌ని వారి న‌మ్మ‌కం. రాఖీ క‌ట్ట‌డానికి గ‌డ‌ప దాటి వెళ్తే ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయ‌ని వారి భ‌యం. 1955లో రాఖీ పండుగ రోజు ఓ యువ‌కుడు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. అది కీడుకు సంకేత‌మ‌ని భావించి రాఖీ పండుగ‌ను చేసుకోవ‌డం మానేశారు ఆ గ్రామ‌స్తులు. అయితే ద‌శాబ్దం కింద‌ట ఊర్లో రాఖీ వేడుక జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. కానీ త‌ర్వాతి రోజు ఉద‌యం ఆ ఊర్లో అలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నే మ‌రొక‌టి జ‌రిగింది. దీంతో రాఖీ పండుగ జ‌ర‌ప‌డం త‌మ ఊరికి, ప్ర‌జ‌ల‌కు మంచిది కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో ఇప్ప‌టికీ జ‌గ‌త్‌పూర్వ‌లో ఎవ‌రూ రక్షా బంధ‌న్‌ని చేసుకోరు.

Read More:

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

క్రేజీ కాంబోః అన్నగా విష్ణు, చెల్లిగా కాజ‌ల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu