ఐసోలేషన్ వార్డులోనే రాఖీ కట్టించుకున్న ముఖ్యమంత్రి

ఐసోలేషన్ వార్డులోనే రాఖీ కట్టించుకున్న ముఖ్యమంత్రి

ఆస్పత్రిలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న శివరాజ్‌సింగ్‌కు ఐసోలేషన్ వార్డులోని ఓ నర్స్‌ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Balaraju Goud

|

Aug 03, 2020 | 10:38 PM

ఆస్పత్రిలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న శివరాజ్‌సింగ్‌కు ఐసోలేషన్ వార్డులోని ఓ నర్స్‌ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం శివరాజ్‌సింగ్‌ చికిత్స పొందుతున్న వార్డులో విధులు నిర్వహిస్తున్న సరోజ్‌ అనే నర్స్‌ ఆయనకు రక్షాబంధన్ పురస్కరించుకుని రాఖీ కట్టింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు. ట్విటర్‌ వేదికగా స్పందించిన ఎంపీ సీఎం ‘రక్షాబంధన్‌ పర్వదినాన నా వార్డులో పనిచేస్తున్న కరోనా వారియర్ సిస్టర్‌ సరోజ్‌ ఎంతో అభిమానంతో నాకు రాఖీ కట్టారు. ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

‘కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ మంత్రి డా.అరవింద్‌ సింగ్‌ బండారియా భార్య సోదరి అర్చన సైతం సీఎంకు రాఖీ కట్టారు. నా సోదరి త్వరగా కోలుకోవాలని, ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని’ శివరాజ్ సింగ్ మరో ట్వీట్‌లో వెల్లడించారు. నా జీవితాన్ని మధ్యప్రదేశ్‌ ప్రజల అభివృద్ధికి, సోదరీమణుల సంక్షేమానికి అంకితమిచ్చానని ట్వీటర్ వేదికగా వెల్లడించారు. చౌహాన్‌కు కొద్దిరోజుల క్రితమే పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో ఆయన భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu