తెలంగాణ : రీ ఓపెన్ చేసిన 4 రోజుల్లో షాకింగ్ క‌లెక్ష‌న్స్..

తెలంగాణ : రీ ఓపెన్ చేసిన 4 రోజుల్లో షాకింగ్ క‌లెక్ష‌న్స్..

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌ డౌన్‌ వల్ల తెలంగాణ‌లో మూత‌ప‌డిన మ‌ద్యం షాపులు దాదాపు నెలన్నర మూత పడ్డ మద్యం షాపులు తెరవడంతో.. సేల్స్ కలెక్ష‌న్ రికార్డు లెవ‌ల్ లో నమోదవుతోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు స‌మాచారం. శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల విక్ర‌యాలు జరిగినట్లు తెలుస్తోంది. గ‌త నాలుగు రోజులు అమ్మ‌కాలు […]

Ram Naramaneni

|

May 09, 2020 | 10:57 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌ డౌన్‌ వల్ల తెలంగాణ‌లో మూత‌ప‌డిన మ‌ద్యం షాపులు దాదాపు నెలన్నర మూత పడ్డ మద్యం షాపులు తెరవడంతో.. సేల్స్ కలెక్ష‌న్ రికార్డు లెవ‌ల్ లో నమోదవుతోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు స‌మాచారం. శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల విక్ర‌యాలు జరిగినట్లు తెలుస్తోంది. గ‌త నాలుగు రోజులు అమ్మ‌కాలు ప‌రిశీలిస్తే… మే 6న రూ.72.5 కోట్లు, మే 7వ తేదీన 188.2 కోట్లు, మే 8న డిపోల నుంచి రూ. 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం అందుతోంది. వీటిని లెక్క చూస్తే… మ‌ద్యం షాపులు పునః ప్రారంభించిన‌ నాలుగు రోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి.

అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ‌లో మద్యం రేట్లను చాలా త‌క్కువగా పెంచారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం.. ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచి అమ్మ‌కాలు కొన‌సాగిస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu