AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC సివిల్ సర్వీసెస్ కల నెరవేర్చుకునే ఛాన్స్.. ఇక్కడ FREE కోచింగ్‌ ఇస్తున్నారు! మీరూ అప్లై చేయండి

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఆగస్టు 24, 2026 నుంచి మే 2027 వరకు ఈ శిక్షణ నిర్వహించనున్నారు. మొత్తం 150 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుండగా, ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌తో పాటు లైబ్రరీ సౌకర్యం కల్పిస్తారు..

UPSC సివిల్ సర్వీసెస్ కల నెరవేర్చుకునే ఛాన్స్.. ఇక్కడ FREE కోచింగ్‌ ఇస్తున్నారు! మీరూ అప్లై చేయండి
Telangana UPSC Free Coaching
Srilakshmi C
|

Updated on: Jul 15, 2026 | 8:04 AM

Share

హైదరాబాద్‌, జులై 15: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత దీర్ఘకాలిక శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ కార్యక్రమం ఆగస్టు 24, 2026 నుంచి మే 2027 వరకు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 150 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో 100 మందిని ఆగస్టు 16న నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మిగిలిన 50 సీట్లను ఇప్పటికే యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా కేటాయించనున్నారు.

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎంపికైన అభ్యర్థులకు హాజరు నిబంధనల మేరకు నెలకు రూ.5,000 స్టైపెండ్ అందజేయడంతో పాటు లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల అభ్యర్థుల ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జులై 17 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆగస్టు 13 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. స్క్రీనింగ్ పరీక్ష ఆగస్టు 16న నిర్వహించనున్నారు.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 040-24071178 లేదా 7780359322 ఫోన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. యూపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం మంచి అవకాశంగా నిలవనుంది.

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us