CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల్లో మూడో భాష తప్పనిసరి.. విధి విధానాలు జారీ!
Central Board: 10వ తరగతి మూడో భాష (R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు. దీనిని పాఠశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షగా నిర్వహిస్తారు. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పొందాలంటే, స్కూల్ నిర్వహించే R3 అంతర్గత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని CBSE..

Central Board: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం మూడో భాష (R3) అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై 9,10 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది.2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలు చదవాలి. ఇందులో కనీసం రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలి. మూడో భాషగా ఏదైనా విదేశీ లేదా నాన్-నేటివ్ భాషను ఎంచుకునే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడ వంటి భాషలను బోర్డు భారతీయ భాషలుగా గుర్తించింది.
బోర్డు పరీక్షలు ఉండవు
10వ తరగతి మూడో భాష (R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు. దీనిని పాఠశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షగా నిర్వహిస్తారు. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పొందాలంటే, స్కూల్ నిర్వహించే R3 అంతర్గత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని CBSE స్పష్టం చేసింది. ఒకవేళ విద్యార్థి అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, ఫైనల్ ఫలితాల ప్రకటనకు ముందే పాఠశాలలు మరోసారి రీ-అసెస్మెంట్ నిర్వహించి వారికి రెండో అవకాశం కల్పించాలి. ప్రస్తుతం (2026-27) 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాత విధానమే కొనసాగుతుంది. వీరికి ఈ నిబంధన వర్తించదు.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: జూలై 17 నుంచి మరో కొత్త వందే భారత్ స్లీపర్.. ఏ రూట్లలో అంటే..
2027-28 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి వచ్చే బ్యాచ్ నుండి ఈ కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. ఎనిమిదో తరగతిలో చదివిన మూడు భాషల కాంబినేషనే 9వ తరగతిలోనూ కొనసాగుతుంది. విద్యార్థులు, పాఠశాలల సౌకర్యార్థం R3 భాషా అభ్యాస సామగ్రిని NCERT తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పాఠశాలలు ఈ మార్గదర్శకాలను అనుసరించి విద్యా ప్రణాళికను రూపొందించుకోవాలని బోర్డు సూచించింది.
ఇది కూడా చదవండి: Silver Prices: రెండు నెలల్లో వెండి ధర ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!
ఇది కూడా చదవండి: Bank Account: 82 ఏళ్ల వృద్ధుడి ఖాతాలో 759 కోట్ల రూపాయలు జమ.. అసలేం జరిగిందంటే..




