తెలంగాణ గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను గవర్నర్ తమిళ సై ఖండించారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న తమిళ సై.. నాలుగు నెలలుగా రాజ్ భవన్ అదే విధానాన్ని అవలంభిస్తుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులు ఉంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా చేయవచ్చని సూచించారు. రాజకీయాలను రాజ్ భవన్ కి ఆపాదించవద్దని ఆమె కోరారు. […]

తెలంగాణ గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2020 | 4:19 PM

తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను గవర్నర్ తమిళ సై ఖండించారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న తమిళ సై.. నాలుగు నెలలుగా రాజ్ భవన్ అదే విధానాన్ని అవలంభిస్తుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులు ఉంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా చేయవచ్చని సూచించారు. రాజకీయాలను రాజ్ భవన్ కి ఆపాదించవద్దని ఆమె కోరారు.

‘నేను డాటర్ ఆఫ్ తమిళనాడు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణ. తొందరలోనే తెలుగు నేర్చుకుంటాను’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా కేసుల రీకవరి లో తెలంగాణ రాష్ట్రం ముందుందన్న ఆమె, క్రమంగా కరోనా ఉదృతి తగ్గుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కరోనా నివారణ చర్యలతోనే వైరస్ అదుపులోకి వస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.