హీరో శివబాలాజీ వైఫ్ కంటతడి.. సీఎం కేసీఆర్‌కు విన్నపం

ఫీజుల వసూళ్ల విషయంలో ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సినీ నటుడు శివబాలాజీ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో, విశ్వాసంతో ఈ మేరకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. ప్రయివేటు స్కూల్స్ టోటల్ ఫీజును ట్యూషన్ ఫీజు గా చూపించి కట్టమనడం దారుణమని వాళ్లు వ్యాఖ్యానించారు. 46 జీవో లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యపేరిట డబ్బులు కూడబెట్టుకోవాలనుకోవడం దారుణమని.. దీనికిది ముమ్మాటికీ సరైన సమయం కాదన్నారు. ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ పరీక్షల పేరిట […]

హీరో శివబాలాజీ వైఫ్ కంటతడి.. సీఎం కేసీఆర్‌కు విన్నపం
Follow us

|

Updated on: Oct 02, 2020 | 3:48 PM

ఫీజుల వసూళ్ల విషయంలో ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సినీ నటుడు శివబాలాజీ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో, విశ్వాసంతో ఈ మేరకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. ప్రయివేటు స్కూల్స్ టోటల్ ఫీజును ట్యూషన్ ఫీజు గా చూపించి కట్టమనడం దారుణమని వాళ్లు వ్యాఖ్యానించారు. 46 జీవో లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యపేరిట డబ్బులు కూడబెట్టుకోవాలనుకోవడం దారుణమని.. దీనికిది ముమ్మాటికీ సరైన సమయం కాదన్నారు. ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ పరీక్షల పేరిట కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. కరోన టైం లో కూడా స్కూల్ ఫీజులు కట్టాలని ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నటుడు శివబాలాజీ అతని సతీమణి మధుమిత హెచ్ ఎస్ పి ఏ ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు సీఎం కేసీఆర్ కు సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు తొలగిస్తున్నారని.. వ్యక్తిగతంగా మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు.

మణికొండలోని మౌంట్ లితేరా స్కూలు నుండి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. మౌంట్ లితేరా స్కూల్ తో మొదలైన ఫీజుల ఒత్తిడి అనేక స్కూళ్లకు పాకిందని.. ప్రయివేట్ స్కూళ్లు సిండికేట్ గా మారి అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలో ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని కేసీఆర్ చెప్పిన మాటల్ని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో తల్లిదండ్రుల్ని క్షోభకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ పిల్లల ఫీజులు మౌంట్ లితేరా స్కూల్ లో ఇప్పటికే 35 శాతం చెల్లించామని.. అయినా ఫీజు కట్టలేదని ఎగ్జామ్స్ రాయనివ్వటం లేదని మధుమిత కంటతడిపెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలల అరాచకాలపై ప్రతి పేరెంటుని సపోర్ట్ చేస్తామని చెప్పారు. ‘మీ వెంట నేనుంటా.. నాకు వేరే పని లేదు. ఇదే పని గా పెట్టుకుంటా’ అని శివబాలాజీ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..