AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ సర్కార్ న్యూ రూల్.. రూ.1కే ఇంటి అనుమతి.!

ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన మునిసిపల్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఇకపై అనుమతులన్నీ సులభంగా మంజూరు చేయడమే కాకుండా.. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కూడా కఠిన చర్యలు చేపట్టనుంది. 75 గజాల్లోపు స్థలంలో(63 చదరపు అడుగులు) జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోనక్కర్లేదు. అంతేకాకుండా ఆన్లైన్‌లో వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇకపోతే ఇంటి నిర్మాణం పూర్తయ్యాక […]

తెలంగాణ సర్కార్ న్యూ రూల్.. రూ.1కే ఇంటి అనుమతి.!
Ravi Kiran
|

Updated on: Jan 17, 2020 | 6:32 AM

Share

ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన మునిసిపల్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఇకపై అనుమతులన్నీ సులభంగా మంజూరు చేయడమే కాకుండా.. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కూడా కఠిన చర్యలు చేపట్టనుంది.

75 గజాల్లోపు స్థలంలో(63 చదరపు అడుగులు) జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోనక్కర్లేదు. అంతేకాకుండా ఆన్లైన్‌లో వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇకపోతే ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మునిసిపాలిటీ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం కూడా పొందాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే 64 చదరపు అడుగులు నుంచి 500 చ.అ.లోపు విస్తీర్ణంలో పదిమీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారు ఇకపై మునిసిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందజేస్తే తక్షణమే అనుమతులు లభిస్తాయి. మరోవైపు 200 చ.అ.లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు 10% బిల్డప్ ఏరియాను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే తప్పుడు వివరాలను నమోదు చేసి అనుమతి తీసుకున్నట్లు తెలిస్తే మాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారు.

అటు 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ, 10 మీటర్ల లేదా అధిక ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలని చూస్తున్నవారికి ఆన్లైన్ ద్వారా కేవలం 21 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు. ఇక  200 నుంచి 500 చ.అ.లోపు విస్తీర్ణంలో నిర్మించిన ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలంటే.. ఆ ఇల్లు రూల్స్ ప్రకారమే నిర్మించినట్లు సదరు యజమాని స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ అది నిబంధలకు విరుద్ధంగా నిర్మిస్తే.. మూడేళ్ళ జైలు, భారీ జరిమానా తప్పదు.