మా బావపై నోరు జారుతావా.. వైసీపీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నందమూరి రామకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత వారం ఓ బహిరంగసభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తాజాగా నందమూరి రామకృష్ణ వీడియో సందేశం ద్వారా.. ద్వారంపూడిని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మూడో అల్లుడని.. మాకు […]

మా బావపై నోరు జారుతావా.. వైసీపీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 1:58 PM

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నందమూరి రామకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత వారం ఓ బహిరంగసభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తాజాగా నందమూరి రామకృష్ణ వీడియో సందేశం ద్వారా.. ద్వారంపూడిని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మూడో అల్లుడని.. మాకు బావగారంటూ పేర్కొన్నారు. మీరు రాజకీయంగా ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి కానీ.. మా కుటుంబం జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. మేం గాజులు తొడుక్కోలేదని.. మేము మీలా సంస్కారం లేకుండా మాట్లాడలేమన్నారు. మేం నోరు తెరిస్తే మీ జాతకాలన్నీ బయటపడతాయని.. మరోసారి మా బావ చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు.