బ్రేకింగ్..’నిర్భయ కేసు దోషుల ఉరితీతలో జాప్యం.. ఢిల్లీ ప్రభుత్వమే కారణం’

నిర్భయ కేసు దోషుల ఉరితీతలో జాప్యం జరగడానికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన ఆరోపణ చేశారు. వారిని ఉరి తీయడంలో ఆలస్యం జరుగుతోందని, ఇందుకు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన పేర్కొన్నారు. న్యాయం జరగడంలో జాప్యానికి ఆప్ ప్రభుత్వానిదే బాధ్యత..మెర్సీ పిటిషన్ దాఖలుకు గత రెండున్నర ఏళ్లలో ఈ సర్కార్ ఈ దోషులకు ఎందుకు నోటీసు జారీ చేయలేదని ఆయన గురువారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు […]

బ్రేకింగ్..'నిర్భయ కేసు దోషుల ఉరితీతలో జాప్యం.. ఢిల్లీ ప్రభుత్వమే కారణం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2020 | 2:48 PM

నిర్భయ కేసు దోషుల ఉరితీతలో జాప్యం జరగడానికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన ఆరోపణ చేశారు. వారిని ఉరి తీయడంలో ఆలస్యం జరుగుతోందని, ఇందుకు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన పేర్కొన్నారు. న్యాయం జరగడంలో జాప్యానికి ఆప్ ప్రభుత్వానిదే బాధ్యత..మెర్సీ పిటిషన్ దాఖలుకు గత రెండున్నర ఏళ్లలో ఈ సర్కార్ ఈ దోషులకు ఎందుకు నోటీసు జారీ చేయలేదని ఆయన గురువారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయిన వారం రోజుల్లోగా ఆప్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఉంటే ఇప్పటికే ఆ నలుగురు దోషులను  ఉరి తీసి ఉండేవారని, ఈ దేశానికి న్యాయం జరిగి ఉండేదని జవదేకర్ పేర్కొన్నారు.

కాగా-జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో ఒకరికంటే ఎక్కువమందికి ఉరిశిక్ష విధిస్తే.. వారిలో ఎవరైనా ఒకరు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్న పక్షంలో.. ఇతర దోషుల ఉరితీత కూడా వాయిదా వేయవలసి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు కూడా హైకోర్టుకు తెలిపారు. సంబంధిత మెర్సీ పిటిషన్ పై నిర్ణయం వెలువడేవరకూ మరణ శిక్ష వాయిదా పడుతుందన్నారు. ‘ అలాంటప్పుడు దోషులంతా మెర్సీ  పిటిషన్ దాఖలు చేసుకునేంతవరకు మీరు చర్య తీసుకోలేదంటే అది మీ రూల్స్ బ్యాడ్ అన్నట్టే కదా ‘ అని ….  ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రాను జడ్జీలు మన్మోహన్, సంగీత థింగ్రా సెహగల్ ప్రశ్నించారు. ‘ ఈ జుడిషియల్ సిస్టం క్యాన్సర్ తో బాధ పడుతోంది ‘ అని వారు కూడా మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.