CM Revanth: మూడేళ్లలో మూసీనదిని తెలంగాణ ఐకాన్‌గా మారుస్తా.. సీఎం రేవంత్ ఎమోషనల్ స్పీచ్

మూసీ నదిని మళ్లీ జీవనదిగా చూసుకోవద్దా.. అరుదైన చేపలు మళ్లీ మూసీలో జలకాలాడొద్దా.. ఒకప్పుడు మన వరప్రదాయినిగా నిలిచిన మూసీ నదిని శాపగ్రస్తంగానే ఉంచుకోవాలా.. దుర్గంధం నుంచి సుగంధం వైపు పయనించొద్దా.. అంటూ మూసీ పునరుజ్డీవంపై..

CM Revanth: మూడేళ్లలో మూసీనదిని తెలంగాణ ఐకాన్‌గా మారుస్తా.. సీఎం రేవంత్ ఎమోషనల్ స్పీచ్
CM Revanth
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2024 | 8:05 PM

నవంబర్ 8.. సీఎం రేవంత్‌రెడ్డి 55వ పుట్టినరోజు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు. కానీ.. పర్సనల్ సెలబ్రేషన్ల సంగతేమో గాని.. బర్త్‌డే మొత్తం జనం మధ్యనే గడిపారు. నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటనతో బిజీగా గడిపారు సీఎం రేవంత్‌రెడ్డి. పుట్టిన రోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నరసన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి దర్శనం తర్వాత వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిపై చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకు వెళతా.. అని హింట్ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఇది చదవండి: 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్చాలని, టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని, గోశాలలో గోసంరక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు వేగవంతం చేయాలని.. నిర్ణయించారు. యాదగిరిగుట్ట సందర్శన తర్వాత.. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేపట్టారు రేవంత్‌రెడ్డి. సంగెం దగ్గర మూసీ కాలువను పరిశీలించి.. భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. ధర్మారెడ్డికాలువ వెంట నేతలు, కార్యకర్తలు, రైతులతో కలిసి రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాలువ వెంట పొలాల్లోని రైతులతో ముచ్చటించి, వారి సమస్యలు విన్నారు. అక్కడే రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌.. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి.. ఇటీవలే స్పెషల్ టీమ్‌ని సియోల్ పంపి.. అనేక అధ్యయనాలు చేయించారు. మరో మూడేళ్లలో మూసీ నదిని తెలంగాణ ఐకాన్లలో ఒకటిగా మారుస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే.. పుట్టినరోజున మూసీలో పడవ ప్రయాణం చేసి.. తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇది చదవండి: బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!