Watch: ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న యువకుడు
దీపావళి పండుగవేళ స్నేహితులతో పందెం కాసి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. కొత్త ఆటో వస్తుందని ఆశపడిని ఆ యువకుడికి ఆరోజుతో నూరేళ్లూ నిండిపోయాయి. పండగ వేళ కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరుకు చెందిన శబరీష్ దీపావళి నాడు స్నేహితులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి బార్ కు వెళ్లి మద్యం సేవించారు. ఆ మత్తులో బాణసంచా కాల్చే విషయంపై ఛాలెంజ్ లు విసురుకున్నారు. బాంబుపై అట్టపెట్టె బోర్లించి దానిపై కూర్చున్న వారికి కొత్త ఆటో కొనిస్తానని, ధైర్యం ఉన్నవారు ప్రయత్నించ వచ్చని మిత్రబృందంలో ఒకరు సవాల్ విసిరారు. దీనికి స్పందించిన శబరీష్.. ఛాలెంజ్ కు తాను సిద్ధమేనని చెప్పాడు. బార్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బాంబు, కార్డ్ బోర్డ్ బాక్స్ తెప్పించారు. రోడ్డు మధ్యలో బాంబు పెట్టి, దానిపై అట్టపెట్టె బోర్లించి శబరీష్ కూర్చున్నాడు. మిత్రులు బాంబుకి నిప్పు పెట్టి అక్కడినుంచి దూరంగా వెళ్లి నిల్చున్నారు. కాసేపటికి లోపలున్న బాంబు పేలడంతో శబరీష్ ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే శబరీష్ ప్రాణం పోయింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా శబరీష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

