Samantha: బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
ప్రముఖ హీరోయిన్ సమంత దీపావళి పండుగను రాజస్థాన్ లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రణతంబోర్ జాతీయ పార్కులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో సమంత చాలా బలహీనంగా కనిపిస్తున్నారని, కాస్త బరువు పెరగాలని ఓ అభిమాని కోరారు. ఈమేరకు సోమవారం సమంత ఇన్ స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ లో సదరు అభిమాని ఈ కామెంట్ చేశారు.
‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టారు. దీనిపై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బరువు గురించి మరో కామెంట్ అంటూ సమంత నిట్టూర్చారు. ‘నేను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలుసో లేదో కానీ వైద్యుల సూచనల ప్రకారం డైట్ మెయింటైన్ చేస్తున్నా. దీనివల్ల బరువు పెరగడం సాధ్యం కాదు. బరువు విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా. దయచేసి ఇతరులలో తప్పొప్పులు చూడడం ఇప్పటికైనా మానేయండి. మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తించండి. లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ సమంత జవాబిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

