Donkey Milk: చిన్నారులకు గాడిద పాలు ఇవ్వడం మంచిదేనా.. తాగిస్తే ఏమవుతుంది.?

గాడిద పాలు అనగానే ముఖం పక్కకు తిప్పుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే గాడిద పాలలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం ఇకపై అలా చేయరని నిపుణులు చెబుతున్నారు. గాడిద పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఇకపై వాటిని వదిలి పెట్టరని నిపుణులు అంటున్నారు. ఇంతకీ గాడిద పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Donkey Milk: చిన్నారులకు గాడిద పాలు ఇవ్వడం మంచిదేనా.. తాగిస్తే ఏమవుతుంది.?
Donkey Milk
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2024 | 7:40 PM

స్కూలుకు డుమ్మా కొట్టే వారిని చదువుకోకుండా గాడిదలు కాసుకుంటావా.? అంటుంటారు. అయితే ఇప్పుడు గాడిదలు పెంచుతూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎంతో మంది సక్సెస్‌ స్టోరీలకు సంబంధించిన కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గాడిద పాలను విక్రయిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. దీంతో అసలు గాడిద పాలకు ఎంతకు అంత డిమాండ్ ఉందన్న దాని గురించి తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. చిన్నారులకు గాడిద పాలు ఇవ్వడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

గాడిద పాలను అందించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీధి వీధి తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తుంటారు. అయితే గాడిద పాలను చిన్నారులకు తాగిపించడం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి.? అసలు చిన్నారులకు గాడిద పాలను పట్టడం మంచిదేనా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గాడిద పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆవు, గేదె, మేక, ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలలో.. తల్లి పాలలో ఉండే పోషకాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. గాడిద పాలలో ఆవు పాలతో సమానమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని శిశువులకు పట్టించడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలను సైతం గాడిద పాలు దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

దగ్గు, దమ్ము వంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు గాడిద పాలు బెస్ట్‌ రెమెడీ అని చెబుతుంటారు. ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, ఆర్థరైటిస్, వైరల్‌ జ్వరాలు, ఆస్తమా, గాయాలు నయం చేసేందుకు గాడిదపాలను మందుగా వాడుతుంటారని నిపుణులు సూచిస్తున్నారు. గాడిద పాలలో యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తున్నాయి. గాడిద పాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఎసిడిటీతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్‌, స్కాబిస్‌, దురద, తామర వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని అంటున్నారు. గాడిద పాలలో ఉండే లాక్టోస్ ఎముకలను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుంది.

ఇక కేవలం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా గాడిద పాలు బాగా ఉపయోగపడతాయి. గాడిద పాలను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే ప్రొటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి చర్మ కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడడంలో సహాయపడతాయి. గాడిద పాలను విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తుండడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

చిన్నారులకు గాడిద పాలు ఇవ్వడం మంచిదేనా.. తాగిస్తే ఏమవుతుంది.?
చిన్నారులకు గాడిద పాలు ఇవ్వడం మంచిదేనా.. తాగిస్తే ఏమవుతుంది.?
విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
మీ ఫోన్ స్లో అవుతుందా.. అయితే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి చాలు..!
మీ ఫోన్ స్లో అవుతుందా.. అయితే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి చాలు..!
యాదగిరి గుట్ట పాలక మండలి ఎలా ఉండబోతుందంటే?
యాదగిరి గుట్ట పాలక మండలి ఎలా ఉండబోతుందంటే?
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
పెరుగుతోన్న 'స్లీప్‌ డైవర్స్‌' ట్రెండ్‌.. ఏంటీ నిద్ర విడాకులు..
పెరుగుతోన్న 'స్లీప్‌ డైవర్స్‌' ట్రెండ్‌.. ఏంటీ నిద్ర విడాకులు..
ఓర్నీ.! సాక్షిగా కోర్టుకొచ్చాడు.. చివరికి ముద్దాయిగా జైలుకెళ్లాడు
ఓర్నీ.! సాక్షిగా కోర్టుకొచ్చాడు.. చివరికి ముద్దాయిగా జైలుకెళ్లాడు
రాహుల్ భయ్యా.! నీ ఆటకో దండం.. చేజేతులా పరువు తీసుకున్నావ్‌గా
రాహుల్ భయ్యా.! నీ ఆటకో దండం.. చేజేతులా పరువు తీసుకున్నావ్‌గా
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!