Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ప్రారంభం.. ఎక్కడివరకంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర భీమలింగం నుంచి నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు కొనసాగుతుంది. అంతకు ముందు తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ప్రారంభం..  ఎక్కడివరకంటే?
Telangana Cm Revanth Reddy Padayatra Starts Along Musi River
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 08, 2024 | 4:29 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ప్రారంభమైంది. భీమలింగం నుంచి నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 2.5 కి.మీ మేర సీఎం రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు ముందు భీమలింగం కాలువలోని శివలింగానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ మూసీ ప్రవాహన్ని పరిశీలించారు.

నల్గొండ జిల్లాలో మూసీ పునరుజ్జీవ యాత్రను సీఎం రేవంత్ చేపట్టారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభమైంది. మూసీ వెంట భీమలింగం కత్వ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్‌ వరకు పాదయాత్ర సాగనుంది. చివర్లో మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగిస్తారు.

వీడియో ఇదిగో:

తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం.. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంకి, మంత్రులు, అధికారులు, స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడినుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. దర్శనం పూర్తయిన తర్వాత రోడ్డుమార్గంలో సంగెం బయల్దేరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి