Investment Tips: పెట్టుబడుల్లో బంగారమే బంగారం.. కానీ ఆ విషయాలు పరిశీలించాల్సిందే..!

భౌగోళిక రాజకీయ ఆందోళనలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు మార్కెట్ అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులకు బంగారంలో పెట్టుబడే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలతో పాటు ఇంధన ఛార్జీల పెరుగుదల, ప్రపంచ వాణిజ్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి బంగారాన్నే ఆశ్రయించారు. దీంతో బంగారం ధర ఎన్నడూ లేని విధంగా పైపైకి ఎగబాకింది. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి విషయంలో కీలక విషయాలను తెలుసుకుందాం.

Investment Tips: పెట్టుబడుల్లో బంగారమే బంగారం.. కానీ ఆ విషయాలు పరిశీలించాల్సిందే..!
Follow us
Srinu

|

Updated on: Nov 08, 2024 | 8:01 PM

భారతదేశ ప్రజలకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది. ఏళ్లుగా బంగారాన్ని కేవలం పెట్టుబడిగా కాకుండా ఆభరణాలు వాడడం పరిపాటి. భారతదేశంలో బంగారం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కసారిగా పెట్టుబడిదారులంతా బంగారం బాట పట్టడంతో సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా బంగారం ధర పైపైకి ఎగబాకింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విశ్లేషణ ప్రకారం బంగారం ప్రస్తుతం సానుకూలంగా స్థిరంగా ఉంది. పెట్టుబడిదారులకు వారి పోర్ట్‌ఫోలియోలలోని ఇతర విభాగాలలో కొనుగోలు శక్తిలో పతనాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్న ఇంధన వ్యయాలు వంటి అంతరాయాల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా, బంగారం చాలా సురక్షితమైన ఎంపిక అవుతుంది. బంగారంపోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా స్టాక్స్‌లో పెట్టుబడికి వెళ్లే వారు తమ పెట్టుబడిని కొంత మేర బంగారంలోకి మళ్లిస్తే తక్కువ నష్టాలతో బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేటు విధానాలు కూడా బంగారం డిమాండ్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం సమయంలో ఆర్థిక వ్యవస్థను మందగించడానికి అనేక కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. అయినప్పటికీ పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణ వ్యయాలను పెంచుతాయి. ఇది వినియోగదారుల వ్యయం తగ్గడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని మందగించడానికి దారితీస్తుంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతారు. కాబట్టి బంగారం ధర పెరుగుతుంది. ముఖ్యంగా యువ పెట్టుబడిదారులు బంగారం సామర్థ్యాన్ని గుర్తించడం ఇప్పటికే ప్రారంభించారని నిపుణులు చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ వంటి అధిక అస్థిరత పెట్టుబడులకు ఇది స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఉంది.

బంగారం అధిక వృద్ధి స్టాక్స్‌లా వేగవంతమైన రాబడిని అందించనప్పటికీ ఇది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాలకు, ప్రత్యేకించి మూలధనాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తులకు విలువైనదిగా ఉంటుంది. ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జ్, అస్థిరతకు వ్యతిరేకంగా బఫర్ లేదా సంపదను సంరక్షించే మార్గాన్ని కోరుకునే వారు బంగారంలో పెట్టుబడికి ముందుకు వస్తారు. భవిష్యత్‌లో ఎక్కువ రాబడి కావాలనే దృష్టితో బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఇది మంచి ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న బంగారం విక్రయించాలనుకునే వారికి ఈ ధరలో విక్రయించడం మేలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..