వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష.. యాసంగి సీజన్​పై దిశానిర్దేశం

వ్యవసాయ, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో

  • Sanjay Kasula
  • Publish Date - 5:52 am, Sat, 23 January 21
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష.. యాసంగి సీజన్​పై దిశానిర్దేశం

Telangana CM KCR Review : వ్యవసాయ, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతోపాటు ప్రాంతీయ అధికారులు, రెండు శాఖల సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.

పంటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్ర తదితర అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. యాసంగి సీజన్​కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తారు.