గణపయ్యా ! నీ పక్కన ఆ ఎమ్మెల్యే విగ్రహం ! ‘ చూసావటయ్యా ‘ ?

అసలే యాదాద్రి గుడిలో స్తంభాల మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖచిత్రాలను చెక్కిన తీరుపై ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తిన వేళ.. అధికార టీఆరెస్ పార్టీ మరో వివాదానికి తెర తీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆరెస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహం ఒకటి గణేశ మండపంలో వినాయక విగ్రహం పక్కనే ‘ వెలిసింది ‘. కేసీఆర్ కుమార్తె కవితకు సన్నిహితుడని చెబుతున్న జీవన్ రెడ్డి.. ఇక్కడ తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆయన సన్నిహితులు , […]

గణపయ్యా ! నీ పక్కన ఆ ఎమ్మెల్యే విగ్రహం ! ' చూసావటయ్యా ' ?
Follow us

|

Updated on: Sep 08, 2019 | 2:32 PM

అసలే యాదాద్రి గుడిలో స్తంభాల మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖచిత్రాలను చెక్కిన తీరుపై ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తిన వేళ.. అధికార టీఆరెస్ పార్టీ మరో వివాదానికి తెర తీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆరెస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహం ఒకటి గణేశ మండపంలో వినాయక విగ్రహం పక్కనే ‘ వెలిసింది ‘. కేసీఆర్ కుమార్తె కవితకు సన్నిహితుడని చెబుతున్న జీవన్ రెడ్డి.. ఇక్కడ తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆయన సన్నిహితులు , పార్టీ కార్యకర్తలు ఆయనతో బాటు ఈ మండపంలో ఫోటోలు దిగారు. దీనిపై అప్పుడే స్థానిక బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా-యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్ ముఖచిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున కాంగ్రెస్, బీజేపీ, బజరంగ్ దళ్ వంటి పార్టీలు, సంస్థలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ ముఖ చిత్రాలను తొలగిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు ఇందుకు పూనుకొంటున్నారు. వారంలోగా ఈ ముఖచిత్రాలను తొలగించకపోతే తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్ఛరించిన సంగతి తెలిసిందే.