గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… ఏంటంటే?

ఏపీలో సెప్టెంబర్‌ 1న నిర్వహించిన గ్రామ సచివాలయం కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల […]

గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఏంటంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 08, 2019 | 7:26 PM

ఏపీలో సెప్టెంబర్‌ 1న నిర్వహించిన గ్రామ సచివాలయం కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈనెల 1, 2 తేదీల్లో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలకు… 11,62,164 మంది హాజరయ్యారు. దీనికోసం 4,465 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ని అధికారులు తాజాగా విడుదల చేశారు. సెప్టెంబరు 1న ఉదయం సెషనులో నిర్వహించిన పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లడంతో.. రెండు ప్రశ్నలకు అదనంగా మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. ఒక ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడం.. మరో ప్రశ్నలో అనువాద దోషం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేటగిరీ -1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికీ అదనంగా రెండు మార్కులు కలవనున్నాయన్నమాట. అభ్యర్థులు తప్పు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా.. ఇవ్వకపోయినా రెండు మార్కులు కలుపుతామని అధికారులు ప్రకటించారు.

కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) అభ్యర్థులకూ 2 మార్కులు.. డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు కూడా అదనంగా రెండు మార్కులు కలవనున్నాయి. అలాగే ఐదు ప్రశ్నలకు రెండు సరైన సమాధానాలు ఉండటంతో.. ఏ సమాధానాన్ని గుర్తించిన సరైన సమాధానంగానే పరిగణించనున్నారు.

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం