పులివెందులలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌..

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశంపార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ వస్తున్నా తనకు తగినంత గుర్తింపు రాలేదన్నారు. చంద్రబాబుకు తనకు మధ్య […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:47 pm, Tue, 10 March 20
పులివెందులలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌..

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశంపార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ వస్తున్నా తనకు తగినంత గుర్తింపు రాలేదన్నారు. చంద్రబాబుకు తనకు మధ్య గ్యాప్‌ పెరిగిందని చెప్పారు. చంద్రబాబు వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటున్నా సరైన ఆదరణ లభించలేదని తీవ్ర ఆవేదనన చెందారు. తన మనసును చంపుకొని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.. కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.