లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా ప్రివిలేజ్ నోటీస్..

లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేశ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘చలో అసెంబ్లీ’ నిరసనను చేపట్టినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం  స్పీకర్‌ ఓం బిర్లాకు నోటీసు  జయదేవ్‌ నోటీసు ఇచ్చారు. అందుకు సంబంధించిన మీడియా కథనాలు, సాక్షాధారాలను కూడా అందజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. అక్రమంగా తనను అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు.  అరెస్ట్ అనంతరం..13 గంటలు అనేక ఊర్లకి తిప్పారని […]

లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా ప్రివిలేజ్ నోటీస్..

లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేశ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘చలో అసెంబ్లీ’ నిరసనను చేపట్టినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం  స్పీకర్‌ ఓం బిర్లాకు నోటీసు  జయదేవ్‌ నోటీసు ఇచ్చారు. అందుకు సంబంధించిన మీడియా కథనాలు, సాక్షాధారాలను కూడా అందజేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. అక్రమంగా తనను అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు.  అరెస్ట్ అనంతరం..13 గంటలు అనేక ఊర్లకి తిప్పారని వెల్లడించారు. ప్రజా ప్రతినిధిగా.. రైతులు నిరసనల్లో పాలుపంచుకోవడం తన బాధ్యతన్న జయదేవ్..రాష్ట్రంలో  పోలీసులు దౌర్జన్యం ఎక్కువైపోయిందని తెలిపారు. మహిళలు, రైతులపై కూడా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని…ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

Published On - 2:05 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu