ఆ సైగ ఏదో అప్పుడే చేసుంటే.. బాలయ్యకు రోజా కౌంటర్

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటు విమర్శలు చేశారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ఎన్టీఆర్‌కు బాబు వెన్నపోటు పొడిచినప్పుడు సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు త్వరలో వస్తుందని ఆమె అన్నారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని… వారు ఉన్నా, లేకున్నా ఒకటేనంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. […]

ఆ సైగ ఏదో అప్పుడే చేసుంటే.. బాలయ్యకు రోజా కౌంటర్

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటు విమర్శలు చేశారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ఎన్టీఆర్‌కు బాబు వెన్నపోటు పొడిచినప్పుడు సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు త్వరలో వస్తుందని ఆమె అన్నారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని… వారు ఉన్నా, లేకున్నా ఒకటేనంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌పై కూడా రోజా విమర్శలు గుప్పించారు.

పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మను తీసుకొచ్చారని రోజా విమర్శించారు. లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని, మండలి రద్దుతో లోకేష్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని అన్నారు. ఇక పవన్ కల్యాణ్‌కు జీవోల గురించి తెలీదని రోజా చెప్పుకొచ్చారు. చీకటి జీవోలు అంటూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులకు అనుగుణంగానే జగన్ అడుగు వేస్తారని రోజా స్పష్టం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu