హుకుంపేట విగ్రహాం మలినం కేసులో పురోగతి.. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి పీఏ సందీప్ అరెస్ట్..!

సోషల్‌ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో బుచ్చయ్యచౌదరి పీఏని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:50 pm, Wed, 20 January 21
హుకుంపేట విగ్రహాం మలినం కేసులో పురోగతి.. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి పీఏ సందీప్ అరెస్ట్..!

 Idol Demolition case : రాజమండ్రి రూరల్‌లో వినాయక విగ్రహానికి మలినం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై తొలుత టీడీపీ నాయకులు బాబు ఖాన్‌ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే సందీప్‌ను అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

రాజమండ్రి రూరల్‌లోని హుకుంపేట వినాయకుని గుడిలో విగ్రహంపై సోషల్‌ మీడియాలో సందీప్ కామెంట్స్‌ పెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని శ్రీశైలంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సందీప్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. గత కొన్నేళ్లుగా టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వద్ద పీఏగా పనిచేస్తున్నాడు సందీప్. కాగా, ఈ ఘటనలో మరికొందరు పై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also…  తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష