AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram politics: గన్నవరంలో టీడీపీ ఆగమాగం.. ఇంఛార్జ్ ఎవరంటే!

వల్లభనేని వంశీ వంటి బలమైన నేత పార్టీకి దూరమవడంతో గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయ నేత కరవయ్యాడని తెలుస్తోంది. నియోజకవర్గ ఇంఛార్జ్‌ని సైతం నియమించే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులో అయోమయంలో పడిపోయాయని అంటున్నారు.

Gannavaram politics: గన్నవరంలో టీడీపీ ఆగమాగం.. ఇంఛార్జ్ ఎవరంటే!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 5:20 PM

Share

TDP in search of Gannavaram in charge: గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నియామకం తెలుగుదేశంపార్టీకి ఛాలెంజింగ్‌గా మారింది.. ఖాళీగా ఉన్న అన్ని నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించినా.. ఆ నియోజకవర్గానికి మాత్రం సరైన నేత దొరకడం లేదట.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమవడం వల్ల. టీడీపీలో వంశీకి ధీటైన నేత లేకపోవడంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌ను ఎప్పుడు నియమిస్తారని తెలుగు తమ్ముళ్లు వెయిటింగ్‌ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న బాపట్ల, గుడివాడ ,మాచర్ల, ఏలూరు, నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ను పార్టీ ఇటీవల నియమించింది. వల్లభనేని వంశీ తరువాత పార్టీకి దూరమైన మరో ఎమ్మెల్యే మద్దాల గిరి నియోజకవర్గానికి కూడా వెంటనే ఇన్‌ఛార్జీని నియమించింది టిడిపి అధిష్టానం. మరి గన్నవరం నియోజకవర్గానికి ఎందుకు ఇన్ ఛార్జ్ నియమించడం లేదనే చర్చ పార్టీలోనూ, బయటా నడుస్తోంది.

వల్లభనేని వంశీ పార్టీ మారిన తరువాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అధైర్య పడకుండా గట్టిగా పోరాటం చేయాలని సమర్థవంత నాయకత్వాన్ని నియమిస్తామని చంద్రబాబు చెప్పారట. ఆ తరువాత పార్టీ జిల్లా అధ్యక్షునితో పాటు ఐదుగురిని కలిపి ఓ కమిటీ వేశారు. అంతే.. ఆ తర్వాత ఇన్‌ఛార్జ్‌ని నియమించే మాటే ఎత్తడం లేదని తెలుస్తోంది. వల్లభనేని వంశీ, అతనిపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు అన్ని రకాలుగా బలమైన నేతలు.. గన్నవరం నియోజకవర్గంలో వంశీని ఢీ కొట్టే ధీటైన నేత లేరు. వంశీ వైసీపీకి దగ్గరవడంతో కేడర్ కూడా అతనితో పాటే వెళ్లింది. టీడీపీలో వంశీని ఎదుర్కొనే నేత నియోజకవర్గంలో లేరనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బయటి నియోజకవర్గాల నుంచి ఎవరో ఒక నేతను తీసుకు రావాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రాంమ్మోహన్‌ భార్య గద్దె అనురాధను నియమించాలని ఆలోచిస్తున్నారట. వీరితో పాటు ఒకరిద్దరు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నా ఏ నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జన పడుతోందట టీడీపీ అధిష్టానం. మొత్తానికి గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్‌ నియామకం టీడీపీకి సవాల్‌గా మారింది.

Read this: Former Governor Vidyasagar Rao’s comments became sensational

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్