AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చపార్టీకి మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై?

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో తాజాగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా  వారి బాటలోనే వెళ్లాలని  నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా కాకినాడలో ఆపార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక హోటల్లో సమావేశమైనట్టుగా సమాచారం. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో వీరంతా భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు […]

పచ్చపార్టీకి మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై?
Pardhasaradhi Peri
|

Updated on: Jun 20, 2019 | 3:11 PM

Share

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో తాజాగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా  వారి బాటలోనే వెళ్లాలని  నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

దీనికి ఊతమిచ్చేలా కాకినాడలో ఆపార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక హోటల్లో సమావేశమైనట్టుగా సమాచారం. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో వీరంతా భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా  విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో వీరంతా రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే వీరంతా పార్టీ మారడంపైనే చర్చిస్తున్నట్టుగా సమాచారం.

ఈ రహస్య భేటీలో మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్,బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్రాయుడు, బండారు మాధవనాయుడు, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు పాల్గొన్నారు.  ఇదిలా ఉంటే తాము పార్టీ మారే ప్రశ్నలేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..