ఎయిర్‌ ఏషియా ఇండియా.. టాటా సన్స్ చేతుల్లోకి..?

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా

ఎయిర్‌ ఏషియా ఇండియా.. టాటా సన్స్ చేతుల్లోకి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2020 | 1:30 AM

Tata Sons in talks to acquire AirAsia India: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా భాగస్వామికి చెందిన 49శాతం వాటా కొనుగోలు కోసం టాటా సన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా టాటాల పరమవుతుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌కు 49 శాతం వాటా ఉంది.

కరోనా సంక్షోభం సమయంలో ఎయిర్‌ ఏషియా నుంచి ఈ వాటాను టాటా సన్స్‌ చాలా చౌకగా దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ ఆర్థిక కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఆస్తులను మించిన అప్పులు, అన్ని జాయింట్‌ వెంచర్లు నష్టాల్లో నడుస్తుండటంతో ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ 18.8 కోట్ల డాలర్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఎయిర్‌ ఏషియా ఇండియా రూ.330 కోట్ల నష్టాన్ని చవిచూసింది.